ePaper
Saturday, September 5, 2026

ప్రజల దీవెనతో సభ విజయవంతం నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత

చీకటి వెలుగు నల్లగొండ

నిన్న నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతం అయ్యిందని దీనిని విజయవంతం చేసినా నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ఆదరణ కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రుజువు అయింది.దీనితో ప్రతిపక్షాలు దిక్కుతోచక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ సభకు భారీగా హాజరైన నల్గొండ మహిళ సోదరీమణులకు ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారి పక్షపాతిగా నిలబడ్డారు.దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మరోసారి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాను . పది సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు చేకూరిన ప్రయోజనం శూన్యమని నేటి రెండున్నర సంవత్సరాలుగా పాలనలో వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిది అన్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్,నెల్లికల్, కిష్ట రాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణ వెల్లంల,చర్లగూడెం రిజర్వాయర్, లను పూర్తి చేయకుండా నల్గొండ రైతులను వంచించిన బిఆర్ఎస్ నేడు ముసలి కన్నీరు కార్చడం విడ్డూరం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను రాజు చేస్తామని సీఎం హామీ ఇవ్వడం సీఎం కు ధన్యవాదాలు. తెలంగాణలో బిఆర్ఎస్ బిజెపి లకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలో చెప్పలేక పోతున్నారని అన్నారు..

ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్,ఎండి ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి,దామనూరి అశోక్, చర్లపల్లి గౌతం, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండి అజీస్, సయ్యద్ నాగుల్, గణేష్, తదితరులు పాల్గొన్నారు….


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!