ePaper
Saturday, September 5, 2026

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు ఘనంగా నివాళులు.

చీకటి వెలుగు నల్లగొండ

బహుభాషా కోవిదుడు భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు మున్సిపాలిటీ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేస్తూ భారతదేశం క్లి ష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపాలన్నారు ఎలాంటి సమస్యనైనా మౌనంగానే ఎదుర్కొని పరిష్కారం చూపేవారున్నారు. అలాంటి మహానుభావుని జయంతిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏవి ఎల్, నరసింహారావు అలియాస్ కన్నారావు, చకిలం సంధ్యారాణి, చకిలం వేణుగోపాలరావు, కంచనపల్లి రవీందర్రావు, దొంతగాని రాజేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!