ePaper
Wednesday, June 17, 2026

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పదవి విరమణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ రీజినల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు 2013 పిఆర్సి ఏరియర్స్ యజమాన్యం చెల్లించవలసిన పిఎఫ్ కంట్రిబ్యూషన్కు పీఎఫ్ కమిషనర్ ఆఫీస్ కు పంపి పెన్షన్ పెరుగుదలకు కృషి చేయాలని, 2017 పిఆర్సి బకాయిలను 9 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు చెల్లించలేదని, 2021 పి ఆర్ సి ని అమలుపరిచి విశ్రాంత ఉద్యోగులకు రావలసిన 2017 ,2021 పిఆర్సి ఏరియాస్ చెల్లించవలెనని, విశ్రాంత ఉద్యోగుల వైద్య సదుపాయాలు మందుల పంపిణీ ప్రతినెలా ఇవ్వాల్సిన మందులను ఒకేసారి రెండు నెలలకు సరిపడా ఇవ్వాలని, తార్నాక ఆసుపత్రిలో మెంబర్షిప్ తీసుకో లేకపోయినా విశ్రాంత ఉద్యోగులందరికీ సభ్యత్వం పొందేలా అవకాశం కల్పించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న, ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు 30000 దహన సంస్కారాలు సహాయాన్ని వర్తింపజేయాలని, విశ్రాంత ఉద్యోగులు చికిత్స నిమిత్తం తార్నాక ఆసుపత్రికి వచ్చు సందర్భంలో రెస్ట్ రూమ్లను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రీజినల్ అధ్యక్షులు కత్తుల యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బోనగిరి శంకరయ్య, రీజినల్ కార్యదర్శి పల్ రెడ్డి యాదగిరి రెడ్డి, బకమల్లయ్య, శ్రీను, సీసీ శేఖర్, వి ఎస్ పి రావు, ఎస్ ఆర్ రెడ్డి, ఎండి గౌస్, వివి రెడ్డి, రవీందర్, వి ఏ రెడ్డి, బోయినపల్లి ఈశ్వరయ్య, వివిధ డిపోల కార్మికులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!