ePaper
Wednesday, June 17, 2026

MGU లో హిందీ,సంస్కృతం,యోగ మరియు ఇతర నూతన కోర్సులను ప్రవేశ పెట్టాలని VC కి ABVP వినతి.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నూతన కోర్సుల ఏర్పాటు చేయాలని ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ABVP యూనివర్సిటీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకు పోటీ పడుతూ ముందు వరసలో ఉంది అని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాత్రమే అని నేడు యూనివర్సిటీలో కేవలం కొన్ని కోర్సులు మాత్రమే అందిస్తుందని విద్యార్థుల ఆకాంక్షలు అనుగుణంగా యూనివర్సిటీలో హిందీ,సంస్కృతం,యోగ,ఎంఏ పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, లిటరేచర్, హిందీ, సంస్కృతం, జర్నలిజం, యోగా, ఎమ్మెస్సీ జువాలజీ, మైక్రో బయాలజీ, ఫారెస్ట్రీ, ఎమ్మేడ్, బిఎడ్, ఎంపైడ్, బి పెడ్, బీటెక్ కోర్సులను ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ క్రమంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, సంపత్ , మౌనేష్ చారి,విజయ్,వెంకటేష్,సతీష్,సూర్య,అజయ్,రాజు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!