ePaper
Wednesday, June 17, 2026

మంత్రి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణచీకటి వెలుగు నల్లగొండ..కనగల్ మండలం ధర్వేశ్పురంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 24 జరిగే అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ హైదరాబాదులో రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు

అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల (జాతర)కు సంబంధించి పోస్టర్, కరపత్రాలను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అన్నారు

ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కే.భాస్కర్, కార్యనిర్వాహణ అధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ అర్చకులు ధర్మకర్తలు మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!