ePaper
Monday, June 22, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన ప్రారంభం… డిజిటల్ విధానంలో సెన్సస్ నిర్వహణ

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జరుగుతున్న జనగణన (Census) కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని ఆయన తెలిపారు.

ఈసారి జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ విధానం వల్ల ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.

దేశ అభివృద్ధి ప్రణాళికలకు ఈ డేటా కీలకమని, ప్రజలు సహకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!