స్వర్ణకారుల సంఘం నాయకుడు పసునూరి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన దశదిన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
పసునూరి జయశంకర్ కుమారుడైన శ్రీనివాస్ సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్వర్ణకారుల సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి, కొల్లోజు సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments