కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
చీకటి వెలుగు నల్గొండ,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. నల్గొండ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం, మాజీ మంత్రి హరీశ్‌రావు, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, రెగట్టే మల్లికార్జునరెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మారగోని గణేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరి ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, రావుల శ్రీనివాసరెడ్డి, పల్లె రంజిత్, పిన్నపు రెడ్డి మధుసూదన్‌రెడ్డి, గంజి రాజేందర్, మాతంగి అమర్, పెరిక కరణ్, జయరాజ్, దండంపెల్లి సత్తయ్య, రాపోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments