ePaper
Sunday, September 6, 2026

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి

నల్లగొండలో ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం

చీకటి వెలుగునల్లగొండ,

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. నల్లగొండలో ఆదివారం శివాంజనేయ గార్డెన్స్‌లో నిర్వహించిన యూనియన్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలు, సంఘ బలోపేతం, ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీస్‌ సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ బిల్లులు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయులకు న్యాయం చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను త్వరగా విడుదల చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు అవసరమైన నియామకాలు చేపట్టాలని, విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై పని భారం తగ్గించడం, బోధనేతర పనులను తగ్గించడం, ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్యలను పరిష్కరించడం, మహిళా ఉపాధ్యాయుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వైద్య రీయింబర్స్‌మెంట్‌, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్‌, ఇతర బిల్లులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనలో సంఘం చేపట్టే పోరాటాలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి ఇక్షం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బట్టాపురం మోహన్‌రెడ్డి, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు, పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకుడు బెలిదె జగన్మోహన్‌గుప్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని 36 మండల శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించగా, దానిపై చర్చించి ఆమోదించారు. అనంతరం ముఖ్యఅతిథులు ఉపాధ్యాయుల సమస్యలు, సంఘటిత ఉద్యమం, భవిష్యత్‌ కార్యాచరణపై సందేశాలు ఇచ్చారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!