కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు ఇదే నిదర్శనం
చీకటి వెలుగు నల్లగొండ.
మహిళా ఉపాధ్యాయురాలు, సీనియర్ సిటిజన్ అయిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి తల్లిపై దాడి చేయడం దారుణమని బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహిళలపై దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. నాగం వర్షిత్‌రెడ్డి తల్లి ఇంటిపై దాడి చేసి, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ఆమెను దుర్భాషలాడిన ఘటనను మహిళలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి ప్రమీల అన్నారు. మహిళ అనే కనికరం లేకుండా ఇంటిపై దాడికి పాల్పడటం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎలాంటి జాప్యం లేకుండా అరెస్టు చేయాలని ఎస్పీ, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి ప్రమీల, జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి మొనగాల సుధారాణి, జిల్లా పార్టీ మాజీ సభ్యురాలు దాసోజు అరుణ, జిల్లా నాయకురాళ్లు నాగమణి, లక్ష్మీ, పద్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments