చీకటి వెలుగునల్లగొండ,
టీఎన్జీవోస్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు, అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి, జిల్లా కార్యదర్శి జే. శేఖరెడ్డి సహా సంఘ నాయకులకు మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు.
రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే ప్రతీక కాదని, పరస్పర గౌరవం, నమ్మకం, ఆప్యాయత, బాధ్యతలకు ప్రతిరూపమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాగిల్ల మురళి మాట్లాడుతూ ఉద్యోగుల కుటుంబంలో రక్షాబంధన్ వంటి పండుగలు ఆత్మీయతను పెంపొందిస్తాయని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోనూ ఇదే ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జే. శేఖరెడ్డి, మైడి జేరావు, ఆకనూరి లక్ష్మయ్య, కె. మనోజ్ ప్రదీప్, భాస్కర్, కాశిం, రవి నాయక్, రమ్యసుధ, సుమలత, సునీత, విజయసుజాత, సుశీల, లక్ష్మి, పద్మ, శశికళ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ తరఫున ఉద్యోగ మిత్రులకు, మహిళా ఉద్యోగులకు, సంఘ నాయకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments