నల్గొండ జిల్లా – నకిరేకల్ మండలం – మండలాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ గుడుగుంట్ల సాయన్న గారు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, నాగం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి, శ్రీ గుడుగుంట్ల సాయన్న గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అదేవిధంగా, కుటుంబానికి అండగా నిలుస్తూ ₹25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే వారి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని, తుది వీడ్కోలు పలికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని శ్రీ గుడుగుంట్ల సాయన్న గారికి ఘన నివాళులు అర్పించారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments