చీకటి వెలుగు నల్లగొండ.
భారత మాజీ ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయ సాధకుడు, మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మహనీయులు ఆశయ సాధన సమితి (మాస్), అంబేద్కర్–జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ, అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు.
మాస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పెరిక కరణ్ జయరాజ్, జిల్లా అధ్యక్షులు శ్రీ కత్తుల జగన్ కుమార్, గౌరవ అధ్యక్షులు శ్రీ కత్తుల షణ్ముఖ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ పెరిక ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శ్రీ రమేష్, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి శశికళ, అంబేద్కర్–జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బొర్రా సుధాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో, సామాజిక న్యాయ సాధనలో, అణగారిన వర్గాల అభ్యున్నతిలో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కందుల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు శ్రీ కొప్పోలు అశోక్, శ్రీ వట్టపు శ్రవణ్, శ్రీ చింత శివరామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కో-ఆప్షన్ సభ్యులు శ్రీ తీగల జాన్ శాస్త్రి, శ్రీ మైనం విక్రమ్, దళిత సంఘాల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పడిదల నవీన్ కుమార్, పట్టణ కార్పొరేటర్లు శ్రీ పెరిక యాదయ్య, శ్రీ బొజ్జ శంకరయ్య, శ్రీమతి స్వాతి రాజశేఖర్, శ్రీ దీప్లా నాయక్, పట్టణ మాస్ అధ్యక్షులు శ్రీ ఇరిగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తుల సన్నీ, ఉపాధ్యక్షులు శ్రీ పెరిక హరి ప్రసాద్, శ్రీ పెరిక అంజయ్య, శ్రీ పేర్ల నరేందర్, శ్రీ పగడాల శివ, శ్రీ బొజ్జ సైదులు, శ్రీ బొజ్జ పాండు, శ్రీ కుడుతల నాగరాజు, శ్రీ మాతంగి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం స్థానిక అంబేద్కర్–జగ్జీవన్ రామ్ భవనంలో భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బొర్రా సుధాకర్ ఆధ్వర్యంలో మరోసారి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments