ePaper
Wednesday, July 8, 2026

కనగల్ ఎక్స్‌రోడ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రభుత్వ అధికారుల వైఫల్యాన్ని ఖండించిన బీజేపీ

నల్గొండ జిల్లా – కనగల్ మండలం: కనగల్ ఎక్స్‌రోడ్‌లో రోడ్డు పనులలో భాగంగా… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించే ప్రక్రియలో అధికారులు మరియు సంబంధిత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా…. అజాగ్రత్త వహించడం వల్ల విగ్రహం ధ్వంసం కావడం అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ, విగ్రహాన్ని తొలగించే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని… సదరు కాంట్రాక్టర్ పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో వెంటనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ గారు, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు చింత ముత్యాలరావు గారు, కనగల్ మండల అధ్యక్షులు బిక్షం గారు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!