నల్గొండ, జూలై 2: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం పిలుపు మేరకు గురువారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలలు బంద్ పాటించాయి. విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర హైకోర్టు విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలు నేరుగా ఫీజులు వసూలు చేయరాదని స్టే ఇచ్చినప్పటికీ, కొందరు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావడం, నేరుగా వసూళ్లకు పాల్పడటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చొకల చరణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొడిగ లింగస్వామి గౌడ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కర్ణాకర్ యాదవ్, ఎంజీ కళాశాల అధ్యక్షుడు నీలకంఠం నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు మాదాని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments