చీకటి వెలుగు.
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ పాల్గొన్నారు. కార్యక్రమానికి కమిషనర్ అధ్యక్షత వహించారు.
మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 618 మహిళా సంఘాలకు చీరల పంపిణీ చేపట్టగా, తొలి విడతలో 20 మహిళా సంఘాలకు చెందిన 192 మంది సభ్యులకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ స్వయంగా తన చేతులమీదుగా చీరలను అందజేశారు. అలాగే వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ తమ వార్డుల మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, మహిళల అభ్యున్నతి కోసం మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మహిళా చైర్‌పర్సన్‌గా వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు హన్ను బాయ్, చింతల ఉమామహేశ్వరి, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ బాబాషరీఫ్, షాదీఖానా చైర్మన్ కరీం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రిసోర్స్ పర్సన్స్ (RPs), మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments