రూ.1.50 లక్షల LOC మంజూరు చేసిన ప్రభుత్వం
చీకటి వెలుగు నల్లగొండ:
అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేతపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల శివకు ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన రూ.1 లక్ష 50 వేల చెక్కును ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments