ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆలకుంట ఝాన్సీరాణి నాగరత్నం రాజు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments