చీకటి వెలుగు..
ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఎంపికైన దేవాలయ కమిటీ చైర్మన్లు, సభ్యులకు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూచించారు. పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మన్లు, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పచ్చల సోమేశ్వర దేవాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు భక్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, దేవాలయాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
అనంతరం పచ్చల సోమేశ్వర ఆలయ చైర్మన్ గజ్జి సురేష్ యాదవ్, వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ఓర్సు రమేష్, ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ కోప్పు సత్య గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులతో ఈఓ సులోచన ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు బొంత వెంకటయ్య, బుర్రి యాదయ్య తదితరులు పాల్గొని ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments