తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన, సామాజిక చైతన్యం లక్ష్యంగా నిర్వహించనున్న “బస్సు యాత్ర” పోస్టర్ను నాయకులు ఘనంగా విడుదల చేశారు. ఈ యాత్ర మే 16 నుంచి మే 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, తెలంగాణ ఆడబిడ్డల వేదిక రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె లింగన్న, సంస్కృత సారధి బుల్లెట్ వెంకన్న, సమితి సలహాదారు తిలకమళ్ళ లింగయ్య, రాష్ట్ర కోశాధికారి మల్లోజు శ్రీనివాస చారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరుకుప్పల కాలాస్త్రి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బట్టలింగం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో సామాజిక చైతన్యం పెంపొందించడం ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments