నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో చందననబోయిన జానకిరాములు–సుజాత దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ గణేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments