ePaper
Friday, May 1, 2026

విద్యుత్ ఉద్యోగుల మేడే వేడుకలు ఘనంగా

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 INTUC ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రమశక్తి అవార్డు గ్రహీత, కంపెనీ అధ్యక్షులు ఎం. సురేష్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఏకతాటిపై నిలబడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థలో శ్రమదోపిడికి గురవుతున్న ఆర్టిజన్లు, పీస్ రేట్ కార్మికులకు న్యాయం జరిగే వరకు యూనియన్ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమిరెడ్డి, కార్యదర్శి పాండు మరియు ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!