ePaper
Sunday, April 26, 2026

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు… పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ స్నేహ శబరీష్ అన్నారు.

కలెక్టరేట్‌లో నిర్వహించిన కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన నిజమైన జర్నలిస్టులకే కార్డులు జారీ చేయాలని సూచించారు.

జిల్లాలో ఇప్పటివరకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుంచి 447 ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించి నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు ఆదేశించారు.

ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, సమాజానికి ఉపయోగపడే నిజమైన సమాచారాన్ని అందిస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రతి దశలో పారదర్శకత పాటించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, డీపీఆర్ఓ పి. రాజేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!