ePaper
Friday, April 10, 2026

నల్లగొండలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె మూడో రోజు విజయవంతం

📍 నల్లగొండ

TVAEJAC ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. నల్లగొండ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ డిమాండ్లను బలంగా వినిపించారు. జిల్లాలో సుమారు 100% కార్మికులు సమ్మెలో పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కలిసి కార్మికులు తమ సమస్యలను విన్నవించారు. ఆయన కార్మికులతో సానుకూలంగా మాట్లాడి, వారి సమస్యలను గౌరవ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి తెలియజేసి, CMDతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

సమ్మెకు సంఘీభావంగా 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ, ఒకే సంస్థలో ఒకే విధమైన నియమాలు అమలు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తమ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా BRTU రాష్ట్ర నాయకులు గుర్రం వెంక రెడ్డి గారు, TVAC రాష్ట్ర నాయకులు సంతోష్ రెడ్డి గారు, రాష్ట్ర JAC కో-చైర్మన్ చింత ఎల్లయ్య గారు కూడా కార్మికులకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ, కార్మికులు మరణించిన సందర్భాల్లో కారుణ్య నియామకాలు వారి విద్యార్హతలకు అనుగుణంగా ఇవ్వాలని, అలాగే సంస్థలో మిగిలిన 6500 మంది కార్మికులను GO నెం.11 ప్రకారం వేతనాలు చెల్లించి ఆర్టిజన్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, పెరుమాళ్ళ మురళి, రమేష్, పెరిక శేఖర్, గుండ్ల లింగారెడ్డి, మేకల బిక్షమయ్య, వేణుగోపాల్ రెడ్డి, బొప్పాని యాదయ్య, దూదిగామ వెంకన్న, అద్దంకి వెంకన్న, శ్రీపతి రమేష్, విజయ్, లతీఫ్, రామ్మూర్తి, ఉమాదేవి, అరుణ, రఫియా తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!