ePaper
Thursday, April 2, 2026

నల్గొండలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వెనుక విద్యానగర్ కాలనీ బోయవాడలో నూతనంగా నిర్మించిన సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హాస్పిటల్‌లో డయాలసిస్ సేవలు ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల వద్ద ముందుగా డబ్బులు అడగకుండా వైద్యం అందించాలని సూచించారు. గతంలో హైదరాబాదులో డబ్బులు లేకపోతే చికిత్స చేయని ఆసుపత్రులు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు నల్గొండలో రావద్దని హెచ్చరించారు.

మనిషి ప్రాణాలను కాపాడడం కంటే గొప్ప సేవలేదని, అందుకే వైద్యులను దేవుళ్లతో పోలుస్తారని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.

ప్రజలు చిన్న విషయాలకు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా, స్థానికంగా అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, డాక్టర్ రాపోలు దివ్య మాట్లాడుతూ గత ఆరేళ్లుగా 10 పడకలతో హాస్పిటల్ నిర్వహించామని, ఇప్పుడు 50 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో విస్తరించామని తెలిపారు. డయాలసిస్, వెంటిలేటర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!