ePaper
Saturday, March 28, 2026

జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్‌గా సాధ్వీ నిరంజన్ జ్యోతి

కేంద్ర మాజీ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి జాతీయ బీసీ కమిషన్ (National BC Commission) ఛైర్పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆమె 2014 నుంచి 2024 వరకు ఫతేపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలందించారు. మోదీ మంత్రివర్గంలో ఆహార శుద్ధి పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలలో సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయ జీవితాన్ని ముందుగా 2012లో యూపీలోని హమీర్పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రారంభించారు.

ఇదే సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా మహారాష్ట్రకు చెందిన కిరణ్ ఉమేష్ మహాలె కూడా బాధ్యతలు స్వీకరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!