దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 మార్చి లోగా జనాభా లెక్కలను పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతం ఉన్న 119 నుంచి 179కు పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే లోక్‌సభ స్థానాలను కూడా 26కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 263కు పెంచాలని, లోక్‌సభ స్థానాలను 25 నుంచి 38కు పెంచాలని కేంద్రం భావిస్తోంది.
ఈ కీలక మార్పులకు సంబంధించిన పునర్విభజన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
డీలిమిటేషన్ అమలులోకి వస్తే రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments