రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలు పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజా పోస్టింగ్స్‌పై కొంతమంది అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు కేటాయించిన శాఖలను మార్చాలని కోరుతూ సీఎస్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
పోస్టింగ్‌ల మార్పుపై కొందరు అధికారులు పరిపాలనా అనుభవం, సీనియారిటీ, గతంలో నిర్వహించిన బాధ్యతలను ప్రస్తావిస్తూ తమ అభ్యర్థనను సమర్పించినట్లు తెలుస్తోంది.
అధికారికంగా ఈ అంశంపై ఎటువంటి ప్రకటన వెలువడకపోయినా, బదిలీలపై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. సీఎస్ కార్యాలయం ఈ అభ్యర్థనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments