ePaper
Monday, March 2, 2026

ఆర్&బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు – యువజన సంఘం సభ్యుల హాజరు

నల్గొండలో ఈ రోజు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి Komatireddy Venkat Reddy గారిని నల్గొండ తొలి మేయర్ Burri Chaitanya Srinivas Reddy మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీ బోయినపల్లి వేదస్రీ శ్రీనివాస్, శ్రీ అలకుంట్ల నాగరత్నం రాజు పాల్గొన్నారు.

అలాగే నల్గొండ మున్నూరు కాపు జిల్లా ప్రతినిధులు, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు మరియు కుల పెద్దలు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో యువజన సంఘం అధ్యక్షుడు పాదం అనిల్ ఆధ్వర్యంలో రఘుపతి వాసుదేవులు, వెంకట నరసయ్య, చింతల చంద్రశేఖర్, వైద్యుల సత్యనారాయణ, చామల కేశవులు, శ్యామల సత్తయ్య, మారబోయిన చంద్రయ్య, శ్యాంసుందర్, వీరమల్ల భాస్కర్, రామారావు, బోరిగం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థి వసతి గృహాల పురోగతి, సామాజిక సంక్షేమం మరియు యువజన సేవా కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ నల్గొండ రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!