హైదరాబాద్‌లో ఎకాలజీ, డెమోక్రసీ, ఎకానమీ అంశాలపై మేధావులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశంను శనివారం నిర్వహించారు. ఈ సమావేశాన్ని అడ్వకేట్, సామాజిక కార్యకర్త డా. లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెగసెసే అవార్డు విజేత ప్రొఫెసర్ సందీప్ పాండే, మాజీ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (టీపీసీసీ ఇన్‌చార్జ్) మీనాక్షి నటరాజన్, కాశ్మీర్ జర్నలిస్టు షాహిద్ సలీం తదితరులు పాల్గొని ప్రసంగించారు.
వక్తలు పర్యావరణ ధ్వంసం వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో పర్యావరణానికి జరుగుతున్న నష్టం, మైనింగ్ పేరుతో ఆరావళి పర్వతాల విధ్వంసం, వ్యర్థాల కారణంగా నదుల కలుషితం ద్వారా మానవాళికి కలుగుతున్న నష్టాన్ని వివరించారు.
పెట్టుబడిదారులు–ప్రభుత్వాల కుమ్మక్కుతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. అలాగే రాజ్యాంగంపై జరుగుతున్న దాడులు, ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యాంగ ప్రతిని అందజేశారు.
ఈ సమావేశంలో ప్రొఫెసర్ రమణ నాయక్, ప్రొఫెసర్ సుబ్బారావు, న్యాయవాది, ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాశం నరేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త నటేష్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments