ePaper
Monday, March 16, 2026

దీర్ఘకాల వ్యాధులకు ప్రకృతి వైద్యం ఎంతో ప్రయోజనకరం : డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు

దీర్ఘకాల వ్యాధుల చికిత్సలో ప్రకృతి వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ యోగాధ్యాయన పరిషత్, ఆయుష్ శాఖ డైరెక్టర్ మరియు కార్యదర్శి డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు తెలిపారు.

అలాగే కొనిజె రోశయ్య నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్, క్యాంపు కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. నవీన్ జ్యోతి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

గురువారం పెన్షనర్ భవన్‌లో మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుష్ ప్రకృతి వైద్య శిబిరం, నేచురోపతి మరియు యోగ వైద్యముల ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వయోవృద్ధుల్లో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రకృతి వైద్యం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

వయోవృద్ధులు యోగాసనాలు, ప్రాణాయామాలపై అవగాహన పెంచుకొని, సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ఈ వయోమిత్ర కార్యక్రమం వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారికి మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో

సీనియర్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు సుహాసిని, శ్రీవాణి,

డాక్టర్లు వెంకటేశ్వర రెడ్డి, రుచిత,

జూనియర్ డాక్టర్లు,

డీపీఎంలు కేతన్, కళ్యాణ్,

పెన్షనర్స్ సంఘం మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గజవెల్లి సత్యం, యాద వాసుదేవ్,

జల్లా శ్రీశైలం, జల్లా పుల్లయ్య, తాడూరు రమేష్, సిహెచ్ యాదగిరి, నేలపట్ల బాలరాజు, బిక్షం, ఆజాం అలీ, శంకరయ్య, చక్రపాణి, ఎస్. ఆంజనేయులు, రవీందర్, ప్రసాద్, ముత్యాలు, కృష్ణయ్య, ఉమామహేశ్వర్, వెంకటయ్య, వేణుగోపాల్,

అలాగే ఆయుష్, యునాని, ఆయుర్వేద సిబ్బంది, యోగా ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!