ePaper
Monday, March 16, 2026

పీఎస్‌ఎల్‌వీకి ఎదురుదెబ్బ.. ఇస్రోకు ఆందోళన కలిగిస్తున్న వరుస వైఫల్యాలు

సైన్స్ & టెక్నాలజీ:

అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌ను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో, పీఎస్‌ఎల్‌వీ రాకెట్ రెండుసార్లు విఫలమవడం ఇస్రోకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. విశ్వసనీయ లాంచ్ వాహనంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పీఎస్‌ఎల్‌వీకి ఈ వరుస వైఫల్యాలు సవాలుగా మారుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ విభాగంలో భారత్ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఇస్రో ముందడుగు వేస్తోంది. అయితే ఇటీవల ఎదురైన సాంకేతిక లోపాలు, అంతర్జాతీయ కస్టమర్ల విశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇస్రో వర్గాల ప్రకారం, ఈ వైఫల్యాలపై లోతైన విశ్లేషణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే దిశగా పనిచేస్తున్నారు. నమ్మకాన్ని తిరిగి పొందేందుకు రాబోయే ప్రయోగాలు కీలకంగా మారనున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!