ePaper
Thursday, March 19, 2026

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహణ

నవీన్ కుమార్, చీకటి వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, గణిత ఉపాధ్యాయుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి దండ వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రామానుజన్ గణిత శాస్త్రానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, ఆయన జీవితం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవి, మధుసూదన్, ముంజ రమ, మిరియం, లత, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని–విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!