ePaper
Monday, March 16, 2026

సంజు సామ్‌న్స్‌పై సిఎస్‌కే ఆసక్తి – అధికారికంగా ధ్రువీకరించిన జట్టు అధికారులు

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందుగా సంజు సామ్‌న్స్‌ను జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సిఎస్‌కే) చురుకుగా ప్రయత్నిస్తున్నట్లు జట్టు అధికారులు ధ్రువీకరించారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో ట్రేడ్‌ చర్చలు కొనసాగుతున్నాయని, భవిష్యత్‌ కోసం నాయకత్వం–బ్యాటింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని సిఎస్‌కే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

సోషల్‌ మీడియాలో సంజు పుట్టినరోజు సందర్భంగా సిఎస్‌కే చేసిన ప్రత్యేక పోస్టుతో ఈ ట్రేడ్‌ ఊహాగానాలు మరింత వేగం అందుకున్నాయి. ఇదే ట్రేడ్‌కు జట్టు సంకేతమని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం రెండు జట్ల మధ్య చర్చలు కొనసాగుతున్నా, తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ఒప్పందం జరిగితే వచ్చే సీజన్‌లో ఇది ఐపీఎల్‌లోని అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

సిఎస్‌కే అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!