ePaper
Sunday, July 26, 2026

నల్గొండ యువకుడు గున్‌రెడ్డి సూర్య వర్ధన్ రెడ్డికి చీకటి వెలుగు టీమ్ అభినందనలు

నల్గొండ: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొనేందుకు నల్గొండ నుంచి వెళ్లి చురుకుగా పాల్గొన్న యువ నాయకుడు గున్‌రెడ్డి సూర్య వర్ధన్ రెడ్డిని చీకటి వెలుగు టీమ్ అభినందించింది.

విద్యార్థుల హక్కుల కోసం ఎంతో దూరం ప్రయాణించి, పోరాట స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. సమాజ సమస్యలపై స్పందించే యువతే భవిష్యత్తులో ప్రజలకు అండగా నిలిచి మార్పును తీసుకురాగలరని అభిప్రాయపడింది.

భవిష్యత్తులో కూడా నల్గొండ ప్రజల సమస్యలపై ఇదే అంకితభావంతో పోరాడుతూ ప్రజల తరఫున గళం వినిపించాలని ఆకాంక్షించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నిజాయితీతో కృషి చేసే ప్రతి ఒక్కరికీ చీకటి వెలుగు టీమ్ తన మద్దతు ఉంటుందని తెలిపింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!