Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జిల్లా విజిలెన్స్‌ కమిటీలో ఎడుదొడ్ల వెంకటరామరెడ్డికి చో

Author
Posted By CHEEKATI VELUGU
| 18 Oct 2026, 04:08 PM | నల్గొండ
జిల్లా విజిలెన్స్‌ కమిటీలో ఎడుదొడ్ల వెంకటరామరెడ్డికి చో

  • నల్గొండలో ఘన సన్మానం.. పలువురు ప్రముఖుల అభినందన

చీకటి వెలుగు – నల్గొండ:
నల్గొండ జిల్లా స్థాయి విజిలెన్స్‌, పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా ఎడుదొడ్ల వెంకటరామరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు శశికళ ఘనంగా సన్మానించి అభినందించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సాహంతో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.
నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ నంబర్‌ A4/1412/2016, తేదీ 15-10-2026 ప్రకారం వెంకటరామరెడ్డికి కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, కమిటీ సభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి, సామాజిక న్యాయం సాధనకు ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా కార్యదర్శి జె. శేఖర్‌రెడ్డి, డీఐ రాజు, పట్టణ అధ్యక్షుడు ఆకనూరు లక్ష్మణ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్‌, రమ్యసుధ, సుమలత, గోవర్ధన్‌రెడ్డి, కిరణ్‌, సామాజిక సంక్షేమ శాఖ ఫోరం అధ్యక్షుడు రణదేవ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొని వెంకటరామరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా విజిలెన్స్‌ కమిటీలో ఎడుదొడ్ల వెంకటరామరెడ్డికి చో - Additional Image