Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాసంగిలో వరి సాగు చేయవద్దు* ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Author
Posted By CHEEKATI VELUGU
| 16 Oct 2026, 06:06 PM | NalgondaCollector
యాసంగిలో వరి సాగు చేయవద్దు*   ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

చీకటి వెలుగు నల్లగొండ.

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి,శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన సూచించారు.శుక్రవారం కనగల్ మండలం శేరిలింగోటం గ్రామంలో నీరు లేక ఎండిపోయిన వరి,పత్తి పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవచ్చని వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం ముందుగానే హెచ్చరించినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి సాగు చేశారని తెలిపారు.పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటడంతో వరితోపాటు పత్తి పంటలు కూడా ఎండిపోతున్నాయని, దీంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయడం వల్ల భూగర్భ జలాల వినియోగంతోపాటు విద్యుత్ వినియోగం పెరుగుతుందని చెప్పారు.పంట చేతికి రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.ఈ పరిస్థితులను స్వయంగా అనుభవించిన రైతులు తమ అనుభవాలను తోటి రైతులకు వివరించి,వారు నష్టపోకుండా చూడాలని కోరారు.యాసంగిలో బోర్లు, బావుల కింద వరి సాగు చేయవద్దని,తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం విత్తనాలు,ఇతర సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవర్,జిల్లా వ్యవసాయ అధికారి నవీన్ కుమార్,ఉద్యాన శాఖ అధికారి శేఖర్,ఏవో బి.అమరేందర్ గౌడ్, ఎస్.లింగోటం సర్పంచ్ పోషమల్ల సురేష్,ఏఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.