యాసంగిలో వరి సాగు చేయవద్దు* ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

చీకటి వెలుగు నల్లగొండ. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి,శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన సూచించారు.శుక్రవారం కనగల్ మండలం శేరిలింగోటం గ్రామంలో నీరు లేక ఎండిపోయిన వరి,పత్తి పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవచ్చని వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం ముందుగానే హెచ్చరించినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి సాగు చేశారని తెలిపారు.పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటడంతో వరితోపాటు పత్తి పంటలు కూడా ఎండిపోతున్నాయని, దీంతో రైతులు...