Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పోరాటం — డా. నాగం వర్షిత్ రెడ్డి

Author
Posted By CHEEKATI VELUGU
| 14 Oct 2026, 06:04 PM | నల్గొండ
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పోరాటం — డా. నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని, వారి పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పోరాటం — డా. నాగం వర్షిత్ రెడ్డి - Additional Image

ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తుండటంతో, కొన్ని సందర్భాల్లో నాలుగైదు నెలల పాటు వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, ప్రతి నెలా నిర్ణీత తేదీన వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

గర్భిణీ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించి, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన సర్వీసు ప్రయోజనాలు అందించాలని కోరారు.

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను శాశ్వత ఉద్యోగులుగా నియమించడం, సర్వీసు ప్రయోజనాలు కల్పించడం గురించి రాసిన 20 సెప్టెంబర్‌ 2025 నాటి లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రెగ్యులర్ పోస్టుల సృష్టి లేదా ఉద్యోగాల క్రమబద్ధీకరణపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

“ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించకూడదు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు, వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుంది” అని డా. నాగం వర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు.