ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పోరాటం — డా. నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని, వారి పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తుండటంతో, కొన్ని సందర్భాల్లో నాలుగైదు నెలల పాటు వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చేసిన...