Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక ప్రచారం ఎన్‌జీ కళాశాల మైదానంలో వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులతో ఏనుగుల రాకేష్ రెడ్డి భేటీ

Author
Posted By CHEEKATI VELUGU
| 08 Oct 2026, 05:19 PM | నల్గొండ
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక ప్రచారం  ఎన్‌జీ కళాశాల మైదానంలో వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులతో ఏనుగుల రాకేష్ రెడ్డి భేటీ

నల్గొండ నియోజకవర్గం: రాబోయే నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్‌జీ కళాశాల మైదానంలో వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. పట్టభద్రులుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని రాకేష్ రెడ్డి అభ్యర్థించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.