పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక ప్రచారం ఎన్‌జీ కళాశాల మైదానంలో వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులతో ఏనుగుల రాకేష్ రెడ్డి భేటీ

నల్గొండ నియోజకవర్గం: రాబోయే నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్‌జీ కళాశాల మైదానంలో వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి వాకర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. పట్టభద్రులుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని రాకేష్ రెడ్డి అభ్యర్థించారు....