Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఛాయాసోమేశ్వరాలయ కోనేరుకు పునరుజ్జీవం పూడికతీత పనులకు శ్రీకారం.. కొత్త కమిటీ ఆధ్వర్యంలో పనులు ముమ్మరం

Author
Posted By CHEEKATI VELUGU
| 05 Oct 2026, 09:22 PM | నల్గొండ
ఛాయాసోమేశ్వరాలయ కోనేరుకు పునరుజ్జీవం  పూడికతీత పనులకు శ్రీకారం.. కొత్త కమిటీ ఆధ్వర్యంలో పనులు ముమ్మరం

  • REPORTER KUKUTLA VARUN

చీకటి వెలుగు, నల్లగొండ టౌన్: జిల్లాకేంద్రానికి సమీపంలోని పానగల్‌ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఛాయాసోమేశ్వరాలయం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయంలోని చారిత్రక కోనేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొత్త కమిటీ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కోనేరు పూడికతీత పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు.

ప్రొక్లెయిన్ల సహాయంతో కోనేరులోని పూడికను తొలగిస్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పూడికతీత పనులు పూర్తయిన అనంతరం కోనేరుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోనేరును అభివృద్ధి చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రపోజల్ సభ్యులు కుడుదల ఎల్లయ్య, పల్‌రెడ్డి వెంకటరెడ్డి, గుండగోని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షిస్తున్నారు. కోనేరు అభివృద్ధి పూర్తయితే ఛాయాసోమేశ్వరాలయానికి మరింత శోభ చేకూరడంతో పాటు, ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.