ఛాయాసోమేశ్వరాలయ కోనేరుకు పునరుజ్జీవం పూడికతీత పనులకు శ్రీకారం.. కొత్త కమిటీ ఆధ్వర్యంలో పనులు ముమ్మరం
REPORTER KUKUTLA VARUN చీకటి వెలుగు, నల్లగొండ టౌన్: జిల్లాకేంద్రానికి సమీపంలోని పానగల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఛాయాసోమేశ్వరాలయం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయంలోని చారిత్రక కోనేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొత్త కమిటీ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న కోనేరు పూడికతీత పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రొక్లెయిన్ల సహాయంతో కోనేరులోని పూడికను తొలగిస్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పూడికతీత పనులు పూర్తయిన అనంతరం కోనేరుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు....