Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మృతదేహానికి నివాళులర్పించి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Author
Posted By CHEEKATI VELUGU
| 04 Oct 2026, 03:26 PM | నల్గొండ
మృతదేహానికి నివాళులర్పించి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలోని శేషమ్మ గూడెంకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల శరత్ కుమార్ అక్టోబర్ 1, 2026న నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులోని ముధు మాణిక్యం పారుగంత కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శరత్ కుమార్ మృతదేహానికి శేషమ్మ గూడెంలోని వారి నివాసం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మృతదేహానికి నివాళులర్పించి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి - Additional Image

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పేర్ల మల్లీశ్వరి-చంద్ర, జేరిపోతుల సైదులు, పేర్ల సతీష్ కుమార్, పేర్ల గోవర్ధన్, పేర్ల హుస్సేన్, శేఖర్, బొంగరాల సైదులు, పేర్ల గిరి, నాగరాజు, చెడుబుద్ధి రామచంద్ర, కార్తీక్, సంజయ్, పండు, తేజ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి