మృతదేహానికి నివాళులర్పించి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలోని శేషమ్మ గూడెంకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల శరత్ కుమార్ అక్టోబర్ 1, 2026న నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులోని ముధు మాణిక్యం పారుగంత కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శరత్ కుమార్ మృతదేహానికి శేషమ్మ గూడెంలోని వారి నివాసం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక...