Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్‌ బాక్స్‌ సేవలు ప్రారంభం

Author
Posted By CHEEKATI VELUGU
| 01 Oct 2026, 06:10 PM | TELANGANA, నల్గొండ
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్‌ బాక్స్‌ సేవలు ప్రారంభం

నల్లగొండ, అక్టోబర్‌ 1: నల్లగొండ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నల్లగొండ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా సౌకర్య కేంద్రం, ఉచిత ఫ్రీజర్‌ బాక్స్‌ సేవలను గురువారం ప్రారంభించారు.

మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సేవలను ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఉపయోగించే ఫ్రీజర్‌ బాక్స్‌లను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్‌ బాక్స్‌ సేవలు ప్రారంభం - Additional Image

ప్రజలకు అవసరమైన సమయంలో సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి. నాగేశ్‌, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ బృకాంత్‌ వర్మ, వైద్యులు డాక్టర్‌ నేతగాని జయలత, డాక్టర్‌ కె. వెంకట నాగరాజు, డాక్టర్‌ జి. నరసింహారావు, నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి అలీ నాగలక్ష్మి మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నల్లగొండ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, లయన్స్‌ జిల్లా గవర్నర్‌ కె.వి. ప్రసాద్‌, ప్రాజెక్టు నిర్వాహకుడు, కంటి దాన కేంద్రం మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హరనాథ్‌ కదిమి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.