లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ సేవలు ప్రారంభం
నల్లగొండ, అక్టోబర్ 1: నల్లగొండ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా సౌకర్య కేంద్రం, ఉచిత ఫ్రీజర్ బాక్స్ సేవలను గురువారం ప్రారంభించారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సేవలను ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్‌లను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో...