Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

Author
Posted By CHEEKATI VELUGU
| 27 Sep 2026, 03:56 AM | TELANGANA, నల్గొండ
భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం  జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం  జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ - Additional Image

చీకటి వెలుగునల్లగొండ,

ఇవి కూడా చదవండి

భూమి కోసం, సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం, పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కిష్టాపురంలో 1895లో జన్మించిన చాకలి ఐలమ్మ పేదల భూమి కోసం ఎనలేని పోరాటం చేశారని తెలిపారు. అప్పటి దేశ్‌ముఖ్‌లకు ఎదురొడ్డి నిలిచి, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనితగా ఐలమ్మ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సమానత్వం కోసం ఆమె చేసిన కృషి, పోరాట పటిమ, పేద ప్రజల సంక్షేమం పట్ల చూపిన నిబద్ధత భావితరాలకు ఆదర్శమన్నారు. స్వాతంత్ర్యానంతరం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి పేదల సంక్షేమం కోసం పనిచేశారని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సంజీవ, ఐలమ్మ ఉత్సవాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ, భవన నిర్మాణ కమిటీ సభ్యులు రాములు, చెన్నయ్య, సత్తయ్య, సునీత, జిల్లా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మురళి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతీలాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.