భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
భూమి కోసం.. సమానత్వం కోసం ఐలమ్మ పోరాటం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చీకటి వెలుగునల్లగొండ, భూమి కోసం, సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం, పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కిష్టాపురంలో 1895లో జన్మించిన చాకలి ఐలమ్మ పేదల భూమి కోసం ఎనలేని పోరాటం చేశారని తెలిపారు. అప్పటి దేశ్‌ముఖ్‌లకు ఎదురొడ్డి నిలిచి, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనితగా ఐలమ్మ...